

Mana News :- దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి రానిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ లేని, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు వెయిటింగ్ ఏరియాలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అనధికార ఎంట్రీ పాయింట్లను క్లోజ్ చేస్తామన్నారు.
