

మనన్యూస్,కాకినాడ:గొల్లప్రోలు కాకినాడ బార్ అసోసియేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని న్యాయమూర్తులు,మహిళ న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.న్యాయవ్యవస్థలో మహిళా న్యాయవాదుల అంతా ముందంజలో ఉండాలని పలువురు జడ్జిలు పిలుపునిచ్చారు.జడ్జిలు పీ.కమలాదేవి,కే శ్రీదేవి, నికిత ఆర్ ఓరా,ఎం హరి నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే మరిన్ని విజయాలు తద్యమని పలువురు జడ్జిలు పేర్కొన్నారు.. ఈ సందర్భంగా మహిళా న్యాయవాదుల సమక్షంలో జిల్లా జడ్జిలు కేకును కట్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా అనేక పోటీల్లో విజయం సాధించిన మహిళా న్యాయవాదులకు బహుమతులను అందజేశారు. న్యాయవాదులు అంతా కలిసి జడ్జిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తింటి విశ్వేశ్వరరావు, కార్యదర్శి చెక్క శ్రీనివాసరావు, లేడీ రిప్రజెంటివ్ జి.సునీత, సరోజిని, ఉమా గౌరీ, బిందు శ్రీ,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
