

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:వాహనాల్లో పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించవద్దని ఈ బయ్యారం ఎస్సై రాజకుమార్ సూచించారు.శుక్రవారం పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఎస్సై రాజకుమార్ ఆదేశాలతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు.వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న డీసీఎంలను ఆపి పరిమితిని మించి కూలీలను ఎక్కించవద్దని సూచించారు.పరిమితిని మించి కూలీలని ఎక్కిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.వాహనాల వెనుక భాగంలో ఖచ్చితంగా రేడియం స్టిక్కర్ ఉండాలని సూచనలు చేశారు.ప్రమాదాల నివారణకు ఖచ్చితంగా అతివేగం,నిర్లక్షణమే కారణం అన్నారు.ఆటోలలో పరిమితి నుంచి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ప్రతి ఒక్కరికి అన్ని రకాల ధ్రువపత్రాలతో పాటు,ఇన్సూరెన్స్, లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈ బయ్యారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
