స్టాలిన్‌పై అమిత్ షా విసుర్లు.. ఎల్‌కేజీ విద్యార్థి.. స్కాలర్‌కు బోధించినట్టుంది

Mana News :- హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ఎల్‌కేజీ స్టూడెంట్.. పీహెచ్‌డీ హోల్డర్‌కు బోధించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ భాష కోసం ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేసింది ఏమీలేదన్నారు. ప్రాంతీయ భాషలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది ప్రధాని మోడీ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటి వరకు సీఏపీఎఫ్ నియామకాల్లో మాతృభాషకు స్థానం లేదన్నారు. కానీ యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎనిమిదవ షెడ్యూల్‌లో మార్పులు చేశామని.. దీంతో సీఏపీఎఫ్ పరీక్షను ఇప్పుడు తమిళంలో కూడా రాయగల్గుతున్నారని పేర్కొన్నారు. స్టాలిన్.. ప్రాంతీయ భాషకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని అడిగారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్యాంశాలను వీలైనంత త్వరగా తమిళ భాషలో ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు