

Mana News :- ఇందుకురుపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పూర్తితో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులకు సలహాలు చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
