భారత్‌లోకి టెస్లా.. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌లో ఏర్పాట్లు..!

Mana News, ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా భారత్‌లో అడుగుపెట్టే వేళ.. ఆటో మొబైల్స్‌పై కీలక నిర్ణయాలు వెలువడవచ్చు. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.మరోవైపు భారత్‌ మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించే విషయంలో ఆచితూచి స్పందిస్తోంది.త్వరలో భారత్‌-అమెరికా అధికారుల మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో టారిఫ్‌లు కీలక అంశంగా మారనున్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. వీటితో టెస్లా భారత మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం భారత్‌ కార్ల దిగుమతిపై 110శాతం సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే పలుమార్లు భారత్‌పై బహిరంగానే విమర్శలు చేశాడు. ప్రపంచంలోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించే దేశంగా అభివర్ణించాడు. తాజాగా ఆయన అమెరికాలోని డోజ్‌ విభాగానికి సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడు. ఇక ట్రంప్‌ కూడా భారత్‌ను ఆటో టారిఫ్‌లపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇటీవల ఆ దేశ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచరించారు. ఈనేపథ్యంలో అమెరికా వర్గాలు భారత్‌లో చాలా రంగాల్లో సుంకాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆటో మొబైల్‌ రంగంపై జీరో టారిఫ్‌ అమలవుతుందని భావిస్తున్నారు.

అమెరికా సుంకాల వడ్డనపై భారత్‌ జాగ్రత్తగా స్పందిస్తోంది. స్థానిక పరిశ్రమలతో మాట్లాడి దీనిపై ఓ విధానం తయారుచేయాలని భావిస్తోంది. ఇటీవల ట్రంప్‌-మోదీ భేటీ సందర్భంగా కూడా టారిఫ్‌ల అంశం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటివి చర్చకు వచ్చాయి. దీంతోపాటు ఇరుదేశాల మధ్య వ్యాపారాన్ని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇక ప్రస్తుతం వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ వారం పాటు అమెరికాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయన అమెరికా వాణిజ్య మంత్రి హువార్డ్‌ లుట్నిక్‌తో భేటీ అయ్యారు. వాణిజ్య ప్రతినిధి గ్రీర్‌తో సమావేశం కానున్నారు.ప్రస్తుతం భారత్‌లో ఏటా 40 లక్షల కార్లు విక్రయిస్తున్నారు. దేశీయ సంస్థలకు ప్రపంచంలోనే అత్యంత రక్షణ కల్పించే మార్కెట్‌గా ఇది నిలిచింది. ఇక భారత్‌ ఇటీవల 30 వస్తువులపై సుంకాలను తగ్గించింది. వీటిల్లో అత్యున్నతశ్రేణి మోటార్‌ సైకిళ్లు వంటివి కూడా ఉన్నాయి.

Related Posts

చైనాకు చెక్: ఆ దేశానికి BrahMos క్షిపణులను ఎగుమతి చేసిన భారత్..!

Mana News ;- BrahMos Missile:రక్షణ ఎగుమతుల రంగంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.మన అమ్ములపొదిలోని అత్యంత పవర్‌ఫుల్ వెపన్,సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన రెండవ బ్యాటరీ ఫిలిప్పీన్స్‌కు దిగుమతి చేసింది. ఏప్రిల్ 2024లో భారత వాయుసేన విమానం…

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను నోరు మెదపకుండా చేసిన భారత్..!

Mana News :- పాకిస్తాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

  • By JALAIAH
  • April 24, 2025
  • 5 views
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.