

ముదిరాజ్ కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి..
మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే అధికారికంగా జరిపి ముదిరాజ్ లే అత్యధికం అని అధికారికంగా తేల్చి చెప్పారని,సర్వే చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లకు ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.శంషాబాద్ లో నిర్వహించిన ముదిరాజ్ కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తోపాటు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్,నీలం మధు ముదిరాజ్,కాసాని వీరేశ్ ముదిరాజ్,ఇతర నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వానికి ముదిరాజ్ ల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ముదిరాజ్ ల సంఖ్యను అధికారికంగా ప్రకటించి,రాజకీయాలలో వారి శాతానికి తగ్గట్టు సీట్లను కేటాయిస్తామని తెలియజేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తున్నదని,ముదిరాజ్ సోదరులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అందుకు గాను పలు ముదిరాజ్ సభలకు ఒక్క పిలుపుతో వేలాదిగా ముదిరాజ్ లు తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నేతలు ఎన్ పీ వెంకటేష్ అందే బాబయ్య,కోళ్ళ వెంకటేష్, ముదిరాజ్ ముఖ్యనాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.