ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం.. సీఎస్‌ స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశం..

Mana News :- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం.. అయితే, కింది కోర్టులో పీపీలు, ఏపీపీలతోపాటు మరికొన్ని పోస్టుల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది.. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. మరోవైపు.. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది.. బోర్డు సభ్యులను నిబంధనల ప్రకారం నియమించాలని, వెంటనే రద్దు చేయాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌.. అయితే, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామక నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///