బీఆర్ఎస్ చేసిన పొరపాటుతో తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చింది..

Mana News :- గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రబీ యాక్షన్ ప్లాన్ ప్రకారం నీటి విడుదల చేస్తున్నాం.. హరీష్ మా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు.. ముఖ్యమంత్రి, నేను ఇద్దరం కలక్టర్, చీఫ్ ఇంజనీర్ లకు ఆదేశాలు జారీ చేశాం.. పంట దెబ్బతినకుండా నీళ్లు ఇవ్వాలని పేర్కొన్నాం.. ఇక, బీఆర్ఎస్ చేసిన పొరపాటుతో తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చింది అని ఆరోపించారు. గతంలో కేసీఆర్, జగన్ విందు, వినోదాలు చేసుకున్నారు అని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇక, కృష్ణా నదిలో అక్రమంగా తెలంగాణకు సంబంధించిన నీటిని ఏపీ తరలించుకుపోతుంటే.. ఆనాటి ఆంధ్ర పాలకులతో కేసీఆర్ కుమ్మక్కైయ్యాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ఎక్కువ నీళ్లు ఇవ్వండి అని లేఖ రాసి.. ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారు.. మీరా మాకు చెప్పేది అని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో వాటా సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడుతున్నాం.. గోదావరి నీళ్లు దోపిడి మీదే.. కమిషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టకుండా వదిలేశారు అన్నారు. నాణ్యత లేని ప్రాజెక్టు కట్టి.. ఇప్పుడు విడ్డూరంగా మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. మేడి గడ్డ నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది.. నీళ్లు నింపితే కొట్టుకుపోతుందన్నారు. అలాగే, 40 గ్రామాలతో పాటు భద్రాచలం మునిగిపోతుందని హెచ్చరించారు అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అయితే, మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోతే.. ఇంకా మిమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేఆర్ఎంబీ సమావేశాలు కూడా మా ఒత్తిడి వాళ్ళే జరిగాయి.. దీంతో నీళ్లు ఏపీ తీసుకెళ్లొద్దు అని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు.. మేము చేసిన ప్రయత్నం వల్ల నీళ్లు మిగిలాయి.. మేము చెప్పిందే నిజం.. బీఆర్ఎస్ నేతలు చెప్పేది అబద్ధం అన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు