

Mana News , అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభ లో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్ పైన స్పీకర్ స్పందించారు. సభ లో నిబంధనలు వివరించారు. ప్రజలు 18 సీట్లు ఇస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని గుర్తు చేసారు. ప్రతిపక్ష హోదా పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. హోదా కోసం కోర్టుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు రాసిన లేఖ గురించి వివరించారు. సభలోనే స్పీకర్ ఈ అంశం పైన స్పష్టత ఇస్తూ.. జగన్ ను క్షమిస్తున్నట్లు చెప్పారు. స్పీకర్ రూలింగ్ :- ఏపీ అసెంబ్లీతో ఏకైక ప్రతిపక్షం ఉన్న తమకు ఆ హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. సభలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వక పోవటానికి నిరసనగా సభకు బహిష్కరించారు. ఇప్పుడు అసెంబ్లీలో ఇదే అంశం పైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్ష హోదా పై జగన్ కోర్టుకు వెళ్లారని గుర్తు చేసారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం 10 శాతం సీట్లు సాధించిన పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు 18 సీట్లు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జగన్ రాసిన లేఖలో :- జగన్ తనకు అభియోగాలు, బెదిరింపులతో గత జూన్ లో లేఖ రాసారని స్పీకర్ వెల్లడించారు. నాడు లోక్ సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని చెప్పటంలో వాస్తవం లేదన్నారు. నాడు టీడీపీ గ్రూపు నేతగానే ఉపేంద్ర వ్యవహరించారని చెప్పుకొచ్చారు. జగన్ తనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారని వివరించారు. జగన్ పిటీషన్ ను విచారణ చేయాలా వద్దా అనే దశలోనే ఆ పిటీషన్ ఉందని చెప్పారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదా పైన వైసీపీ అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి వారి పైన అయినా అసత్యాలు ప్రచారం చేయటం వారి ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు.