

హ్యాక్-ఫ్రీ సైబర్ ప్రో లాక్ కాన్సెప్ట్ అమలుపై చర్చ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ ను కలసి,హ్యాక్-ఫ్రీ సైబర్ ప్రో లాక్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకుబేటర్ కాన్సెప్ట్ అమలు కోసం చర్చలు నిర్వహించారు,ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో సైబర్ భద్రతను పెంచుకోవడానికి,సైబర్ దోపిడి నుండి ప్రజలను రక్షించడానికి ఉపయోగపడుతుందని, విద్యార్థులు, ప్రజల మధ్య సైబర్ వ్యవస్థపై అవగాహన పెంచడానికి తగు ప్రణాళికలు తీసుకోవాలని నిర్ణయించారు, ఈ సమావేశంలో, స్పార్క్ ఫౌండేషన్ తరపున ప్రదీప్ అన్ని యూనివర్సిటీ చాలెంజ్,లో విజేతగా నిలిచినందుకు మరియు నాసా అంబాసిడర్ సర్టిఫికేషన తో కలెక్టర్ షాన్ మోహన్ సన్మానించారు. సీఈఓ సాయి ప్రదీప్ తన ప్రతిభతో ఈ ప్రతిష్టాత్మక చలెంజ్ లో సఫలమయ్యారన్నారు, భవిష్యత్తులో, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పార్క్ ఫౌండేషన్ యొక్క సలహాదారుగా చేరే అవకాశం ఉన్నట్లు తెలిపారు, ఈ భాగస్వామ్యంతో, సైబర్ భద్రత, విద్య, మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి సంకల్పించారు, ఈ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఒక గ్రాండ్ ఇన్క్యుబేటర్, సెంటర్ ద్వారా కొత్త మైండ్స్ ను ప్రోత్సహించడానికి, సాంకేతికత మరియు పరిశోధన రంగంలో కొత్త అవకాసాలను సృష్టించడానికి సహాయం చేస్తుందని, వైవిధ్యమైన అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు, స్పార్క్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయాలని, ఇంకా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని అభినందించారు.