

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక
కామారెడ్డి, నవంబర్ 11(): రాష్టరావిర్భావం కోసం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన చిన్న పత్రికలు ( స్థానిక పత్రికల ) సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించి గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టి ఋణభారంతో బ్రతుకులీడుస్తున్న పాత్రికేయులను ఆదుకోవాలని జాతీయ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్. యు. జె. (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్రం ప్రధాన కార్యదర్శి శ్రీ తోకల అనిల్ కుమార్ అధ్యకతన సోమవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ఎన్. యు. జె. జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడం లోనూ అలాగే ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తున్న చిన్న పత్రికల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఎన్నో ప్రమాణాలు చేసినప్పటికీ ఒక్కటి అమలుకు నోచు కోలేదని వందలాది చిన్న పత్రికలు ఎమ్పనెల్మెంట్ లేక ప్రభత్వ ప్రకటనలు రాకపోవడంతో ఆయా పత్రికల యాజమాన్యాలు దుర్భర పరిస్థితి ఎరుకొంటున్నాయని వీటి గురించి అన్నీ విషయాలు స్పష్టంగా తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వీటిని ఆదుకొని తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే పట్టించుకుని, ఆర్థిక సహాయ ప్యాకేజీలను ప్రకటించాలని ఆయన కోరారు.
అలాగే తెలంగాణ మీడియా పాలిసినీ ప్రకటిండం, తెలంగాణ ప్రెస్ అండ్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా, తెలంగాణ భూమి పుత్రులైన పాత్రికేయులకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు తమ జీవితాన్ని పత్రికా రంగానికి అంకితం చేసి, ప్రజల గొంతుకగా నిలుస్తున్నారన్నారు . అలాగే జర్నలిస్టు స్కీమ్ లలో యూనియన్ల పాత్రను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టి. ఎస్. జె. యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తోకల అనిల్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న యూనియన్లు జర్నలిస్టు ల సంక్షేమం కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యాని అలా కాకుండా తాము ఒక ప్రత్యామ్నాయ జర్నలిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చూట్టామని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బాపిరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లా కమిటీ : జిల్లా అధ్యక్షుడిగా బోకల వేణు, ఉపాధ్యక్షులుగా నిస్సి సామ్ సన్ , కుంటోళ్ల యాదయ్య, సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా రావులపల్లి మధు, సంయుక్త కార్యదర్శిగా బాలవంతుల శ్రావణ్ , కోశాధికారి గా సంకి నారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా కాంబ్లే బాలాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏం. డి. ఇలియాస్, సంయుక్త కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయులు కౌసర్ అలీ ఎన్నికయ్యారు.
- చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి – ఎన్. యు. జె. జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని
- తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక
- జిల్లా అధ్యక్షుడిగా సీనియార్ పాత్రికేయుడు బో కల వేణు
- ప్రధాన కార్యదర్శి గా రావుల పల్లి మధు. కోశాధికారి సంకి నారాయణ.
- జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా కాంబ్లే బాలాజీ
- తెలంగాణ మీడియా పాలసీ ప్రకటించాలి
- తెలంగాణ ప్రెస్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- జర్నలిస్టుల సంక్షేమ పథకాలు ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఇవ్వాలి