

Mana News, Tamilnadu :- కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, స్టాలిన్ ఈ వ్యాఖ్యల చేయడం ద్వారా కేంద్రం ప్రభుత్వంపై వ్యంగ్యాంగా విమర్శలు చేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా ఇది జరిగితే రాష్ట్రానికి ఎనిమిది నియోజకవర్గాల వరకు తగ్గుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 5న సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ నూతన దంపతులు అర్జెంట్ గా పిల్లలను కనాలంటూ వ్యాఖ్యానించారు.స్టాలిన్ మాట్లాడుతూ.. ”నవ దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేను చెప్పాను. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోన్న వేళ ఇప్పడలా చెప్పలేను. ఇంతకుముందు మేం కుటుంబ నియంత్రణపై దృష్టిసారించాం. కానీ, ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే.. లోక్ సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది. అందుకే నేను నేను చెప్పేది ఒక్కటే. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి” అంటూ రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.