స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి- ప్రతి పనిలో విజయం మీ సొంతం..

Mana News :- స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని శాంతి లభిస్తుందని నమ్మకం. సుబ్రమణ్య స్వామి భక్తులకు స్కంద షష్ఠి చాలా ముఖ్యమైనది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగ బలం, విజయం, ధైర్యానికి చిహ్నం. దృక్ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్షం షష్ఠి తిథి మార్చి 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:16 గంటలకు ప్రారంభం అవుతుంది. మర్నాడు మార్చి 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:51 గంటలకు షష్టి తిధి ముగుస్తుంది. ఈ నేపధ్యంలో స్కంద షష్టి ఉపవాసం మార్చి 4న చేయాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ రోజున కొన్ని దానాలు చేయడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని వెల్లడించారు.స్కంద షష్ఠి రోజున వేటిని దానం చేయాలంటే :- స్కంద షష్ఠి రోజున పండ్లు దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాలు దానం చేయడం వల్ల జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయి. పెరుగు దానం చేయడం వల్ల ఆయుస్సు, ఆరోగ్యం పెరుగుతాయి. పేదలకు ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో సుఖం, సంతోషం లభిస్తాయి. నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు శాంతిని పొందుతారు. మోక్షాన్ని పొందుతారు. బెల్లం, నెయ్యి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. నీటిని దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దాహంతో ఉన్నవారికి మీరు నీటిని అందించవచ్చు లేదా బహిరంగ ప్రదేశాలలో తాగు నీటి స్టాళ్లను ఏర్పాటు చేయవచ్చు. పేదలకు దుప్పట్లు దానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. ఈ విషయాలను గుర్తుంచుకోండి:-దానం చేసేటప్పుడు… ఎల్లప్పుడూ శ్రద్ధ, భక్తి భావన ఉండాలి. నధర్మాలు పేదవారికి, ఆపన్నులకు చేయాలి.దానం చేసే సమయంలో నేను గొప్ప వంటి ఎటువంటి అహంకారం భావం ఉండకూడదు.దానధర్మాలు ఎల్లప్పుడూ రహస్యంగా చేయాలి. స్కంద షష్ఠి ప్రాముఖ్యత :-స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం వలన భక్తుల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ చేసే పూజ, వ్రతం, ఉపవాసం వలన కోపం, దురాశ, అహంకారం, కామం వంటి చెడు గుణాలు తొలగి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. పురాణ గ్రంథాల ప్రకారం స్కంద షష్ఠి రోజున కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థానం లభిస్తుందని నమ్మకం.

    Related Posts

    మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?

    Mana News :- అర్జున్‌కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన ఫ్రెండ్స్‌తో వీకెండ్‌లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు…

    తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే..

    Mana News :-  తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    • By APUROOP
    • April 27, 2025
    • 6 views
    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి