

Mana News :- సీఎం చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్టుగా ఇన్ డైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తప్పవని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం వెదురుకుప్పంలో ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కుల అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ సీఎం జగనన్నకే దక్కింది అన్నారు.