

Mana News :- వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరి లో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభు ఇచ్చిన వివరాలను డివియేట్ చేసి దుబాయ్ లో సునీల్ కుమార్ పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK 525 లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK 526 లో హైదరాబాద్ తిరిగివచ్చారు సునీల్ కుమార్ .2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి EK 525 విమానం లో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28 న EK 524 విమానం లో అమెరికా నుండి హైదరాబాద్ కు దుబాయ్ మీదగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. డిసెంబర్ 14 2022 నుండీ డిసెంబర్ 19 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్ లో పర్యటించారు. 2021 అక్టోబర్ 2న EK 525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10 న EK 524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదు . 21 డిసెంబర్ 2019 నుండి 4 జనవరి 2020 వరకు అమెరికా లో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్ లో పర్యటించారు. ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లగించి పలుమార్లు ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసిన నేపథ్యంలో సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.