

Mana News :- తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం మల్లం-నాయుడుపేట వెళ్లే మార్గంలో దామరాయగుంటవద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు మల్లం వైపు నుంచి కొత్తగుంట వైపు వెళుతూ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవరుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయాలపాలైన డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు.