

బంగారుపాల్యం మార్చి 1 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం నల్లగాంపల్లి గ్రామపంచాయతీకి చెందిన టిడిపి నాయకుడు, పారిశ్రామికవేత్త శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నెల్లికాయల డ్రైయింగ్ పరిశ్రమ గురించి వివరించడం జరిగింది.ఈపరిశ్రమ ద్వారా మండలంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి పరిశ్రమకు అండగా ఉంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు, ఎన్.పి. జయప్రకాష్ నాయుడు తనయుడుఎన్. పి.పృద్వి తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు, మైనార్టీ లీడర్ షబ్బీర్, సోము, యూత్ ప్రెసిడెంట్ మహేష్, ఉమాపతి, విజయ్ గోవిందు,తదితరులు పాల్గొన్నారు.