

బంగారుపాళ్యం మార్చ్ 1 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన షేక్ ఫిరోజ్ అహ్మద్ కు ముస్లిం ఐక్యవేదిక తరపున శనివారం ముస్లిం సోదరులు సన్మానించి బొకే ఇచ్చి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఫిరోజ్ అహ్మద్ మాట్లాడుతూ, తనకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించిన ముస్లిం సోదరులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ముస్లిం సోదరులకు ఎంతటి కష్టం ఎదురైనా తాను ముందుండి సమస్యలను పరిష్కరిస్తామని ముస్లిం సోదరులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సంతపేట సౌకత్, రాష్ట్ర సమన్వయకర్త ఎస్ రషీద్, చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు ఎస్. ఫిరోజ్ అహ్మద్, పూతలపట్టు నియోజవర్గ గౌరవాధ్యక్షులు రహీం, అధ్యక్షులు కాజా, ఉపాధ్యక్షులు జైనుల్, రిటైర్డ్ డిఇఓ డాక్టర్ అజమాతుల్లా అజిత్ భాయ్, సాలిహ సేటు, గఫర్ బాయ్, సాబిర్ తదితరులు పాల్గొన్నారు
