

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్
చిత్తూరు జిల్లా ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు జి.ఆంజనేయులు తో చిత్తూరు జిల్లా ప్రతినిధులుసిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు, మాజీ ఎంపీ మధు తో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రతినిధులతో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు కవలకుంట్ల జయరాజ్ మాట్లాడుతూ, ఈ కార్యవర్గాన్ని బలోపేతం చేయడానికి మరింతగా కృషి చేస్తున్నట్లు ఆయన ఈ సమావేశంలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏపీబీజేయు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చల్ల జయచంద్ర మాట్లాడుతూ, జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ లో కొనసాగుతున్న 375 మంది సభ్యులకు గాను త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఎస్ జయచంద్ర తెలిపారు. ఇదియే కాక త్వరలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జయచంద్ర తెలిపారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అలసత్వం వ్యవహరిస్తుందని, నెలలు పెంచుకుంటూపోతూ జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతింటున్నాయని దీనిపై త్వరితగతిన ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్లు దీనిపై స్పందించాలని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చల్లా జయచంద్ర తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా చల్లా జయచంద్ర ధన్యవాదములు తెలిపారు.