

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్
మంగళ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవం రోజునే 1988 ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదిక ఆవిర్భవించిందని తెలిపారు .ఈ సందర్భంగా ప్రజలలో మూఢనమ్మకాలను తొలగించడం కోసమై సైన్స్ మ్యాజిక్ షో ను నిర్వహించారు. ఈ మ్యాజిక్ షోలో చేతిలో కర్పూరం వెలిగించి నోట్లో వేసుకోవడం ,విద్యార్థి తలపై మంట వెలిగించడం, సూలాన్ని నాలుకపై గుచ్చుకోవడం మొదలైన వాటిపై మ్యాజిక్ ను నిర్వహించి అందులో దాగి ఉన్న సైన్స్ నియమాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె .ఎస్. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ దినోత్సవ సందర్భంగా ఈరోజు పాఠశాలలో అనేక ప్రయోగాలను నిర్వహించారని దీని ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు అని తెలిపారు అనంతరం విద్యార్థులు మూఢనమ్మకాలపై మరియు సైబర్ నేరాలపై లఘు నాటికలు ప్రదర్శించి అందరి మన్నళ్లు పొందారు . సైన్సు ఉపాధ్యాయులు పిల్లారప్ప, ప్రేమ కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రమాదేవి సంజీవి భారతి ధన శేఖర్ మోహన్ రెడ్డి సంపంగి శ్రీనివాసులు పాల్గొన్నారు
