

వినాయక సాగర్ వాకర్స్ నూతన కార్యవర్గం ప్రమాణం
ఆధ్యాత్మిక వ్యాప్తికి కృషి
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడతాం
మనన్యూస్,తిరుపతి:సమాజ స్థాపనకు, సామాజిక సేవలకు, ఆధ్యాత్మిక వ్యాప్తికి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని నూతన కార్యవర్గం వెల్లడించింది. శుక్రవారం ఉదయం తిరుపతి ఎస్ఎల్వీ నగర్ లోని రుద్రరాజు సంపూర్ణమ్మ గార్డెన్స్ లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు సాంబశివారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక మహానగరం తిరుపతిలో సమసమాజ స్థాపనకు సామాజిక సేవలకు ఐకమత్యంతో అందరినీ కలుపుకుని నిరంతరం అందుబాటులో ఉంటూ విస్తృతంగా సేవలు అందిస్తామన్నారు. కోశాధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ భేదాభిప్రాయాలు లేకుండా అవినీతిరహిత కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు జరిగే శ్రీరామ రథయాత్రకు తమ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు నూతన కార్యవర్గం అధ్యక్షులు సాంబశివారెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు సుకుమార్, సహాయ కార్యదర్శి సాయి కృష్ణమరాజు, కోఆర్డినేటర్ చంద్రమోహన్, లీగల్ అడ్వైసర్ మంజుల, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర రావు, వెంకటేశ్వర్లు, నిరంజన్ నాయుడు, సిరిగిరి శంకర్ రాజు, శివానందరెడ్డిలు ప్రమాణం చేశారు. అనంతరం రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సుకుమార్ రాజు చేతుల మీదుగా మూర్తి త్రయం పుస్తక వితరణ జరిగింది.