కూటమి తొలి బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగులు…

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతుల యువత ఉద్యోగుల అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యం

ఆ దిశగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్

కృతజ్ఞతలు తెలిపిన తెలుగు తమ్ముళ్లు

మనన్యూస్,తిరుపతి:గత వైసిపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్లో ఏపీ రాష్ట్ర అభివృద్ధికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ బాబు పయ్యావుల కేశవులు తొలి అడుగులు వేయడం అభినందనీయమని టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ తులా చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యాదవ్ టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మతో కలిసి మాట్లాడారు. ఏపీలో గత వైసిపి రాక్షస పాలన పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలలోనే రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2025 – 26 కూటమి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3 లక్షల 22 ,350 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులు ఉద్యోగులు , విద్యార్థిని విద్యార్థులు యువత తో పాటు సూపర్ సిక్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అన్ని రంగాల అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు అభినందనీయమన్నారు. ఈ బడ్జెట్ ఒక నూతన వరవడిని సృష్టించిందని కొనియాడారు. ప్రధానంగా మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా పంచాయతీల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఆశయాలు మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి బడ్జెట్ మరెన్నో లేదని రాష్ట్రంలోని ప్రజలు మేధావులు హర్షిస్తున్నారని అన్నారు. ఈ బడ్జెట్లో రైతులకు పెద్దపీట, విద్య వైద్య తరంగానికి పంచాయతీల అభివృద్ధికి ప్రధానంగా అర్బన్ పరిధిలోని పేదల అభ్యున్నతికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్ టి బి సి మైనారిటీ రైతుల పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి కూడా నిధులు కేటాయించడం సీఎం గొప్పతనాన్ని వివరించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు జయరాం హేమంత్ రాజయ్య చెంగయ్య సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు