

మనన్యూస్,గొల్లప్రోలు:జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్దిని విద్యార్థులు వివిధ ప్రాజెక్టు వర్కులను తయారు చేసి ప్రదర్శించారు.ఈ ప్రదర్శనలను మాధురి విద్యాసంస్థలు అదినేత కడారి తమ్మయ్య నాయుడు వీక్షించి ఉత్తమ ప్రతిభ కనపర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సర్ సివి రామన్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.అంతకు ముందు రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మమత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.