

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ , సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని,పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి స్వామిని దర్శించుకున్నారు.అనంతరం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర గర్భాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… ఆ పరమ శివుడు ఆశీస్సులతో ప్రజలంతా బాగుండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో రుద్రయ్య,నాయకులు స్వామి, సృజన్ పాటిల్, శేఖర్ పాటిల్,భాస్కర్ రెడ్డి, అశోక్,నవాజ్ రెడ్డి,గోపాల్, శ్రీకాంత్ రెడ్డి,సంగమేశ్వర్ రెడ్డి, బంటు శేఖర్,తదితరులు ఉన్నారు.

