

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు జవహర్ నాలెడ్జ్ సెంటర్, మహిళా సాదికారిత విభాగం మరియు డా. వినయ్ శంకర్ పౌండేషన్, దివాన్ చెరువు సంయుక్తంగా మగ్గం వర్క్ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులు ప్రారంభానికి కళాశాల ప్రిన్సిపల్ డా. డి. సునీత అద్యక్షత వహించి విద్యార్దినులు స్వయం ఉపాది కలిగి ఉండేలా కొన్ని విద్యలలో నైపుణ్యం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో డా. వినయ్ సుంకర ఫౌండేషన్ ఛైర్మన్ డా. సుంకరి వేంకటేశ్వర రావు గార్ని సంప్రదించి కళాశాలలో ఈ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేశామని, విద్యార్ధునులు అన్ని రంగాలలో నైపుణ్యం కలిగి ఉండాలని మారుతున్న సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా ఆర్ధికంగా ఎదగాలని కోరారు. మనిషికి నైపుణ్య విద్య ఆత్మస్థైన్యాన్ని,ఆనందాన్ని ఇస్తుందని,. ఈ శిక్షణ తరగతులు 20 రోజులు ఉంటాయని ప్రతి విధ్యార్ధిని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు
ఫౌండేషన్ ఛైర్మన్ డా.సుంకరి వేంకటేశ్వర రావు మాట్లాడుతూ మహిళలు ఇతరుల పై ఆర్ధిక అవసరాల కొరకు ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్లు ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండాలని , అందులో భాగంగా మగ్గం వర్క్ కూడా మీకు తోడ్పడుతుందని ఈ చక్కని అవకాశం అందురు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో శిక్షకులు రూప,మీనా,గనిలక్ష్మి, కుమారి,కుమారి తేజ మరియు కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ పిఓ డా.ప్రయాగమూర్తి ప్రగడ,విమెన్ ఎమ్పౌఎర్మెంట్ కన్వీనర్ శ్రీలక్ష్మి, సభ్యులు కుమారి మేరి రోజలీనా శ్రీమతి పుష్ప మరియు అధ్యాపకులు శ్రీ.వి.రామారావు,కె.సురేశ్,డా.ఎస్కే. మదీనా,వీరభద్రరావు,డా బంగార్రాజు,సతీష్ అధ్యాపకేతర సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.