

మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంబు మొగిలీశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా మూడవ రోజు కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామి మంగళవారం రాత్రి సింహ వాహనం పై పురవీధులలో దర్శనమిచ్చారు. కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి కి ఉభయదారులుగా ఉషోదయ హై స్కూల్ యాజమాన్యం వారిచే నిర్వహించడం జరిగినది. పరిసర గ్రామ ప్రజలకు భక్తులకు ద్వీప కాంతులతో కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామిని దర్శించుకొని భక్తుల మ్రోక్కుబడులను తీర్చుకున్నారు.