

మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కార్యాలయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ, కాపు,ఈబిసి,కమ్మ,రెడ్డి,బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియ కులాలకు చెందిన లబ్ధిదారులు గ్రామ సచివాలయాల ద్వారా ఆయా కార్పొరేషన్ లో బ్యాంకు లింకేజీ సబ్సిడీ రుణాల కోసం 30-01-2025 వ తేదీ నుండి 15-02-2025 వ తేదీ లోపు లబ్ధిదారులు 946 మంది దరఖాస్తులు నమోదు చేసుకోవడం జరిగిందని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. బ్యాంకు లింకేజీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీధర్, సంబంధిత బ్యాంకు మేనేజర్ల ద్వారా మండల పరిషత్ కార్యాలయం బంగారుపాళ్యం నందు 25-02-2025 వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించుచున్నారు. ఇంటర్వ్యూలకు అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో ఎంపీడీవో కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఇంటర్వ్యూలకు వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తుదారులు అధికారులకు సహకరించాలని ఇన్చార్జి ఎంపిటివో శ్రీధర్ కోరారు. సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అధికారులకు సహకరించడంతో ఇంటర్వ్యూలు సజావుగా సాగినట్లు ఇన్చార్జి ఎంపిడిఓ శ్రీధర్ తెలిపారు