స్వామి త్యాగరాజ ఆరోధోత్సవాలు నిర్వహించిన ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ

సామూహిక పంచరత్న కృతుల ఆలాపన

స్వామి త్యాగరాజ స్వామీజీ కళాకారుల అర్పించిన నివాళికి పరవశించిన అభిమానులు

మనన్యూస్,కాణిపాకం:సాంప్రదాయ లలిత కళల వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ (ఐ ఎఫ్ ఏఎస్) చెన్నైలో అతి పురాతన సభగా గుర్తింపు పొంది లలిత కళలను ప్రజల్లోనూ యువకుల్లోనూ ప్రత్యేక సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ వార్షిక త్యాగరాజ ఆరాధోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు సంగీత విద్వాంసులు పాల్గొని త్యాగరాజ స్వామి విరిచిత పంచరత్న కృతులను ఆలపించారు. కర్ణాటక సంగీత మూర్తులతో త్యాగరాజ స్వామితో పాటు ముత్తుస్వామి దీక్షితార్ శ్యామ శాస్త్రిలు ఉన్నారు. తమిళనాడు తంజావూర్ జిల్లాలోనీ తిరువయ్యలో ప్రతి సంవత్సరం ఆయనను స్మరిస్తూ పంచరత్న కృతులను ఆరాధించడం పరిపాటి అదే సమయంలో దేశంతో పాటు ప్రపంచంలోని అన్ని నగరాల్లో పంచరత్న కృతులను ఆలాపించడం జరుగుతుంది. ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ సంప్రదాయ కర్ణాటక సంగీతాన్ని యువతకు ఆసక్తి పెంపొందించేలా చేస్తూ త్యాగరాజ ఆరాధోత్సవాలను ఈ ఏడాది ఎత్తి రాజా కళ్యాణ మండపంలో నిర్వహించి సంగీత లలిత కళ ఉత్సవాన్ని జరిపింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పేరుపొందిన కర్ణాటక సంగీత విద్వాంసులు పలువురు ఏకమై పంచరత్న కృతులను ఆలపించారు. గాత్ర విధ్వంసులతో పాటు వయోలిన్, మృదంగం, ఘట్టం, మోర్సింగ్, కంజీర విధ్వంసులు 70 మందికి పైగా పాల్గొని పంచరత్న కృతులను ఆలపించారు. వారిలో ప్రఖ్యాత విధ్వాన్సులైన శ్రీయుతులు శ్రీముషీమ్ ఏ రాజారావు, నర్మదా, భూషిని కళ్యాణ రామన్, అయ్యర్ సిస్టర్స్, మధువంతి బద్రి, స్వాతి శ్రీ, గీతా రాజా, కలకత్తా, శంకర్, శ్రీ రంజిని కౌశిక్, పిఎస్ ఆముదు, తిరుచ్చి, కే .మురళి, తిరువిడైమరదూర్ ఎస్. రాధాకృష్ణన్, కరూర్ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ముందుగా త్యాగరాజ స్వామి చిత్రపటానికి హారతి ఇచ్చి ప్రార్థనలతో ప్రారంభం కాగా కళాకారులు పంచరత్న కృతులను సమ్మోహనంగా ఆలపించి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో యువ కళాకారులు భావోద్యాలకు కాగా, సంగీత అభిమానులు ఉత్సాహంగా సంగీతాలపనకు మైమరిచారు, వారిలో సంగీత రసికులతో పాటు, బాల కళాకారులు తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు, ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఉన్నారు. శ్రీయుతులు అధ్యక్షులు రామచంద్రన్, కార్యదర్శి డాక్టర్ ఆర్. రాధాకృష్ణన్ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి