

మన న్యూస్, విజయనగరం ; ఆదివారం నాడు విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డు దగ్గర ఉత్తరాంధ్ర ఫ్రీ చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు జ్వాలాముఖి మీడియాకి తెలిపారు. అయన మాట్లాడుతూ.. సుమారు 85 మంది అభ్యర్థులు పాల్గొన్నారు అని చెప్పారు. ఈ పోటి సుమారు ఐదు జిల్లాలకు సంబంధించిన చెస్ పోటిగా పరిగణించబడుతుంది అని చెప్పారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీ లోని కొల్లా పుష్ప రాణి అగ్రస్థానం కైవసం చేసుకోగా 2వ స్థానం భాస్కరరావు సొంతం చేసుకున్నారని చెప్పారు. ఈ పోటీలకు క్యాష్ ప్రైజ్ బహుమతి ఇవ్వగా, ప్రజలు నుండి మంచి స్పందన లభించిందని అన్నారు.
