

మనన్యూస్,పినపాక:హైదరాబాద్,తార్నాక నందు ఎమ్మెల్సీ ప్రో.కోదండరాంకి వారి స్వగృహంలో ఆదివాసి సమస్యలు,డిమాండ్లపై ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర,తుడుందేబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి,ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలువాయి ఉషాకిరణ్ తదితరులు వారికి తెలుపుతూ జీవో.నం.3 ను సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల గత 5 ఏండ్ల నుండి ఏజెన్సీలో ఆదివాసిలు అనేకం ఉద్యోగాలు కోల్పోయారని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 100/% రిజర్వేషన్ ఆర్డినెన్సు ఇచ్చే విధంగా కృషి చేయాలని,పెండింగులో ఉన్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని,వివాదంలో ఉన్న ఏజెన్సీ మణుగూరు,పాల్వంచ,మంద మర్రి గ్రామాలకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని,ఇసుక పాలసీలో పూర్తిగా పీసా చట్టం ప్రకారం ఆదివాసీలకే కల్పించాలని,మణుగూరు-బీటిపిస్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని,ఐటీడీఏ లకు పాలక మండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని,నల్లమల అటవీ ప్రాంతం చెంచు పెంటి,గూడేల అబివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారి దృష్టికి తీసుకెళ్లగా ప్రో.కోదండరాం పేర్కొంటూ మార్చి మొదటి వారంలో రాష్ట్రం లోని అన్ని ఆదివాసి సంఘాల ప్రతినిధులతో సెమినార్లు చర్చలు జరిపి గవర్నర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేస్తానని హామీని ఇచ్చారు.