

తుది జాబితాలో ఉన్నవారి ఓట్లను యధావిధిగా ఉంచాలి..
తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు డాక్టర్ బాలు.
మనన్యూస్,కామారెడ్డి:మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల తుది జాబితాలో ఉన్న ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు ఉపాధ్యాయుల పేర్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం జరిగిందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు డాక్టర్ బాలు విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదును కరీంనగర్ ఎలక్ట్రోలర్ అధికారికి ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేయడం జరిగిందని దీనివలన 350 మంది గా తుది జాబితాలో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ ఓటు కలిగిన ఉపాధ్యాయులు,అధ్యాపకులు అమూల్యమైన ఓటు హక్కును కోల్పోవడం జరిగిందని అన్నారు.కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా అధ్యాపకులు ఉపాధ్యాయులు ఓటు హక్కును కోల్పోయారని,తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై విచారణ చేపట్టాలని,ఓటు కలిగిన వారికి కనీసమైన సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించడం సరికాదని దీనిపైన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
