

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : మండలం యర్ర వరం గ్రామంలో ఉభయగో దావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా టీడీపీనాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బస్సా ప్రసాద్, టీడీపీ నాయకులు మైరాల కనకరావు, జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేస్తూ రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు,దాసరి రమేష్ పలువురు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.