


మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. విద్యావంతులు నరేందర్ రెడ్డి ఉపాద్యాయుల సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం సుబిక్షంగా ఉందని మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధ్యాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు అనీస్, లక్ష్మయ్య,బంగ్లా ప్రవీణ్,గాండ్ల రమేష్,రాము రాథోడ్,అంజయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
