మాకు న్యాయం చేయమంటే మాపై పోలీస్ కేస్ పెడతానని బెదిరిస్తున్న కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,కామారెడ్డి:మా వంశపార్యం పరంగా వస్తున్న స్థలాన్ని అక్రమంగా వెంచర్ వేస్తుండగా బంజ నాగయ్య మనమలమైన బంజ శంకరప్ప, బంజా సంగప్ప, బంజ రాజప్పలం తమ స్థలం సర్వేనెంబర్ మూడులో ఇతరులు అక్రమంగా వెంచర్ చేస్తున్నానని అవి వెంచర్కు పర్మిషన్ ఉందా లేదా అని పర్మిషన్ లేకుంటే దాని నిలిపివేయాలని కార్యదర్శిని కోరగా మా పైనే పోలీస్ కేసు పెడతానని గాంధారి కార్యదర్శి నాగరాజు మమ్మల్ని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మా స్థలాన్ని ఇతరులు మా స్థలం కాదని అంటుండగా అట్టి స్థలంలో మేము గతంలో భావితవ్వుకొని పంటలు పండించుకున్నామని ఆ విషయం గ్రామస్తులకు తెలుసని ఇట్టి విషయాన్ని అధికారులను పలుకుబడి కలిగిన వ్యక్తులు తప్పుడుతో పట్టిస్తూ ఉండడంతో మాకు తెలిసిన వారితో ఆర్టిఐ ద్వారా సమాచారం కోరగా ఆ వెంచర్కు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని సదర్ కార్యదర్శి ఆర్టిఏ లెక్కలో పేర్కొన్నారు అన్నారు. పర్మిషన్ లేని స్థలంలోని ప్లాట్లను ఎవరు కొనవద్దు అమ్మ వద్దని బోర్డు పెట్టాలని, హద్దురాలను తొలగించాలని కార్యదర్శిని కోరగా మాపైన పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు అన్నారు. మేము ప్రభుత్వ అధికారులను కోరేది ఒక్కటే మా స్థలంలో వీరు వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తే ఆ తర్వాత ఆ ఫ్లాట్లకోన్న పేద ప్రజలు ఇబ్బందుల గురి అవుతారని అలా జరగకుండా ఉండేందుకే ముందస్తుగా ప్రభుత్వ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. మాకు బుధవారం రోజున ఎంక్వైరీ కి వస్తున్నాము మీరు రండి అని డిఎల్పిఓ డిపిఓ కి చెప్పాడని మాకు శనివారం తప్ప మరో రోజు డిఎల్పిఓ ఫోన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధారి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు మా ఒకరి స్థలం పైన ఇలా వ్యవహరించారా లేక ఇతర స్థలాలపై కూడా ఇలాగే వ్యవహరించారని అధికారులు సవివరంగా విచారణ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు. కార్యదర్శి నాగరాజ్ తప్పుడు అసెస్మెంట్ నెంబర్ లిస్టు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడని మాకు తెలిసిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మాకు జరుగుతున్న అన్యాయంపై బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్కు, ఇలా పంచాయతీ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. తప్పుడు అసెస్మెంట్ నెంబర్ ఇచ్చిన దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///