

ఆదివాసి సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు
మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామంలో సంకా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న శ్రీ దేవి సడాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.అనంతరం శ్రీ దేవి సడాలమ్మ తల్లి గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పినపాక గ్రామంలో సంకా వారి కుటుంబ సభ్యులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే శ్రీ దేవి సడాలమ్మ తల్లి జాతరలో పాల్గొని సడాలమ్మా తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు.సడాలమ్మా తల్లి దీవెనలు ఈ పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కలిగి ఉండాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథ,పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, lయువజన నాయకులు,కార్యకర్తలు,పినపాక శ్రీ దేవి సడాలమ్మా తల్లి ఆలయ కమిటీ సభ్యులు,ఆదివాసి పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.