

మనన్యూస్,తిరుపతి:విధి నిర్వహణ లో ఉన్న టీటీడీ ఉద్యోగి ని భూతులు తిట్టిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ను వెంటనే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము -చీర్ల కిరణ్ నిన్న టీటీడీ ఉద్యోగి అయిన బాలాజీ శ్రీవారి ఆలయం ముందు ఉన్న మహాద్వారం వద్ద విధులు నిర్వహిస్తుండగా టీటీడీ బోర్డు సభ్యులైన నరేష్ గారు శ్రీవారి దర్శనం అయిన తరువాత మహాద్వారం గేట్ నుండి బయటకి వెళ్ళేటప్పుడు టీటీడీ ఉద్యోగి బాలాజీ బోర్డు మెంబెర్ ను అడ్డుకోలేదు, ఆయన తో పాటు వచ్చిన అటెండర్ జనార్దన్ రెడ్డి తో మహాద్వారం నుండి ఎవరిని పంపించకూడదు అని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం మీకు తెలుసు కదా అన్న అని బోర్డు మెంబెర్ అటెండర్ తో చెబుతూ ఉండగా అప్పటికే అక్కడకు చేరుకున్న బోర్డు మెంబెర్ కోసం టీటీడీ ఉద్యోగి బాలాజీ మహాద్వారం గేట్ ను తీశారు. నిమిషం కూడా ఒప్పిక పట్టని బోర్డు మెంబెర్ నరేష్ గారు అక్కడ విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీ ని అసభ్యకరంగా దుషిస్తూ కింద తెలిపిన విధంగా“థర్డ్ క్లాస్ నా కొడకా..పోరా బయటకి, నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా, నీ అంత్తు చూస్తా.లోపలికి కాదు రా బయటికి పో..ఇన్నా కొడుకుని ఇక్కడ పెట్టదండి.లోపలికి కాదు రా బయటకి పో.థర్డ్ క్లాస్ నా కొడకా..అని సాక్షాత్తు శ్రీవారి ఆలయం ముందు,భక్తులు,మీడియా ముందు విధులలో ఉన్న టీటీడీ ఉద్యోగి ని ఈ విధంగా భూతులు తిట్టడం ఎంత వరకు న్యాయం.రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టను కాపాడడానికి,మంచి నిర్ణయాలు తీసుకొన్ని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ బోర్డు ను, బోర్డు సభ్యులను నియమిస్తే, ఇక్కడకు వచ్చే బోర్డు సభ్యులు ఈ విధంగా ప్రవర్తించడం మంచి పద్దతేనా. రాత్రనక పగలనక అటు శ్రీవారి భక్తులకు, ఇటు సంస్థకు సేవలు అందిస్తున్న టీటీడీ ఉద్యోగుల పై ఇటువంటి భూతులు తిట్టడం కరెక్టే నా. మొన్నటికి మొన్న వరహాస్వామి గుడిలో విధులు నిర్వహిస్తున్న ఒక్క టీటీడీ ఉద్యోగి ఒక బోర్డు మెంబెర్ ను పుష్కరిణి లోకి అనుమతించలేదని ఆ టీటీడీ ఉద్యోగిని సస్పెండ్ చేసారు. ఈ రోజు సాక్షాత్తు శ్రీవారి ఆలయం ముందు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగిని టీటీడీ బోర్డు మెంబెర్ నరేష్ గారు ఇలా భూతులు తిట్టడం. ఇలా టీటీడీ ఉద్యోగులు భవిష్యత్ లో ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి. అసలు టీటీడీ ఉద్యోగులు ఇక్కడకు వచ్చే బోర్డు మెంబెర్ లకు సేవలు చేయాలా లేదా భక్తులకు సేవ చేయాలా అనేది అర్ధం కాని అయోమయ పరిస్థితి లో ఉన్నారు. ఇలా విధి నిర్వహణ లో ఉన్న టీటీడీ ఉద్యోగి ని తన విధులను అడ్డుకొన్ని అతనిని భూతులు తిడుతూ విధుల నుండి పంపించ్చేసే హక్కు టీటీడీ బోర్డు సభ్యుడికి ఎక్కడిది. టీటీడీ ఉద్యోగి అయిన బాలాజీ విధి నిర్వహణ ను అడ్డుకొన్ని నోటికొచ్చినట్లు మాట్లాడి అతని వ్యక్తి గత జీవితాన్ని మరియు టీటీడీ ఉద్యోగుల మనోదైర్యాని దెబ్బతీసిన సదరు టీటీడీ బోర్డు సభ్యుడైన నరేష్ గారు సదరు టీటీడీ ఉద్యోగి అయిన బాలాజీ గారికి, టీటీడీ ఉద్యోగులకు, భక్తులకు క్షమాపణలు చెప్పి గౌరవంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని టీటీడీ ఉద్యోగుల తరపున తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మా భవిషత్తు కార్యాచరణ ను సిద్ధం చేస్తామని, టీటీడీ ఉద్యోగుల ఐక్యత ఏమిటో తెలియచేస్తామని హెచ్చరిస్తున్నాం.