

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం; ఈనెల 20వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో జరిగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు పసగడుగుల నానాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపి ఈపీడీసీ కార్యాలయం వద్ద మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యధికంగా నిరక్షరాస్యులు ఉండటం వల్ల స్మార్ట్ మీటర్ వినియోగంలో అవకతవకలు చోటు చేసుకుంటాయి అన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు వల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది విద్యుత్ మీటర్ రీడర్స్ రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. మీటర్ రీడర్స్ కు సంస్థలోనే ఉద్యోగాలు కేటాయించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, మీటర్ రీడర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉగ్గిన సతీష్ కోశాధికారి బీరా శ్రీను, పసకొడుకులు నూకరాజు, పైల చిన్ని,ఎస్కే అలీషా, కె. దుర్గా, ఎం. సంజయ్, సిహెచ్. లక్ష్మణ్, ఎ. అశోక్, ఎం. రాజేష్ లు ఉన్నారు.