

మనన్యూస్,శ్రీకాళహస్తి:నియోజకవర్గం,తొట్టంబేడు మండలం,కాసరం పంచాయతీ నుండి 50 కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు,పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీ లో చేరారు.పార్టీలో చేరిన వారికి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలలో చేస్తున్న అభివృద్ది చూసి ఆయన నాయకత్వంలో తమ పంచాయతీలో సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.గ్రామాల్లో ప్రతి సమస్య ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా పరిష్కరిస్తామని వినుత గారు హామీ ఇవ్వడం జరిగింది.