

మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు
మనన్యూస్,పినపాక:నియోజకవర్గం మండల పరిధిలోని వలస గొత్తి కోయల గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి సోమవారం నాడు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ మణుగూరు మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామాలైన పెద్దిపల్లి,రేగుల గండి,సర్వాయి గుంపు,బుడుగుల, మల్లెతోగు,విప్పల గుంపు తదితర గ్రామాలలో అనేకమంది గొత్తి కోయలకు ఆరోగ్యశ్రీ కార్డులు లేని కారణంగా ప్రమాదాలకు గురైన సందర్భంలో లేదా అనారోగ్యం పాలైన గిరిజనులు మెరుగైన వైద్య చికిత్స పొందాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితని ప్రభుత్వపరంగా ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే రానున్న వేసవి నేపథ్యంలో వలస గోత్తి కోయల గ్రామాలకు గిరిజన గ్రామాలకు, మండల పరిధిలోని అన్ని గ్రామాలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని. బుగ్గ ఖమ్మం తోగు,పెద్దిపల్లి,రాయన్నపేట రేగుల గండి సర్వాయి గుంపు,విప్పల గుంపు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని మనవి చేశారు. తెలంగాణకు మణిహారంగా నిలుస్తున్న బిటీపీఎస్ పక్కనే ఉన్న మండల పరిధిలోని ఆదివాసి గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నారని ప్రభుత్వం స్పందించి ఆదివాసి గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నాయకులు దుర్గం ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.