

వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన డాక్టర్ మార్కండేయులు.
మనన్యూస్,నాగోల్:అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త హరిత ప్రేమికుడు జోగినేపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు డాక్టర్ మార్కండేయులు స్పందిస్తూ పద్మశ్రీ వనజీవి రామయ్య గారితో కలిసి మొక్కలు నాటడం జరిగింది అలాగే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చొప్పున నాటి కెసిఆర్ గారికి జన్మదిన బహుమతిగా ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వనజీవి రామయ్య దంపతులు తో పాటు డాక్టర్ మనోజ్ డాక్టర్ ప్రదీప్ భాస్కర్ బాల్రెడ్డి మరియు ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు.