

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ రాజు లు కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేకును కట్ చేసి నాయకులకు తినిపించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇంకా ఆయన నిండు నూరేళ్లు చల్లంగా ఉండాలని అన్నారు. తెలంగాణ తీసుకువచ్చి రైతులకు నాయకులకు ప్రజలకు ఎన్నో సేవలందించిన ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాజీ జడ్పి చైర్మన్ నాయకులతో కలిసి మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజీద్ అలీ,మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ,మాజీ సీడీసీ చైర్మన్ గంగారెడ్డి,మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి,చందర్,నాయకులు దఫెదర్ విజయ్,మహేందర్, ఇస్తే కార్,శ్రీధర్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్,తదితరులు ఉన్నారు

