

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మధ్యాహ్న భోజన పథకం అమలు,విధి విధానాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత మెరుగైన రీతులలో సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను కార్యాచరణ పథకాన్ని తయారు చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ను ప్రత్యేక పరిశీలన చేసి నివేదికలు సమర్పించాలని కోరిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మధ్యాహ్నం భోజన పథకం అమలు అయ్యే విధానం పాశాలల స్థాయి నుండి హాజరు,రోజువారి హాజరు రిపోర్టుల సమర్పణ,ఎంఈఓ కార్యాలయాల్లో సిద్ధం చేసే బిల్లుల వివరాల గురించి కలెక్టర్ పరిశీలించారు.కొత్తగూడెం విద్యాధికారి కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథక లక్ష్యాలు- అమలు విధానాలు-పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా రిపోర్టులు పంపిస్తున్నారు మరియు బిల్లులు వాటి మంజూరు కు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,కొత్తగూడెం ఎంఈఓ ప్రభు దయాల్, ఫైనాన్సు అధికారి శ్రీనివాస్ రావు లను అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్న లోపాలను అధిగమిస్తూ మరింత సమర్థవంతంగా ఎలా అమలు చేయాలని విషయం కులంకషంగా చర్చించారు. మధ్యాహ్న భోజన పథకం మెరుగైన రీతుల్లో అమలయ్యేలా,బిల్లులు మరింత వేగంగా మంజూరు అయ్యేలా కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ స్వయంగా రూపొందించారు.ఈ మేరకు కలెక్టర్ మరింత సమర్థవంతంగా మధ్యాహ్న భోజన పథకం అమలు అయ్యేలా ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయనున్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ మరియు కార్యాలయ సిబ్బంది,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.