

తవణంపల్లె మన న్యూస్ ఫిబ్రవరి-15
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు షికారి కాలనీ నందు శనివారం తవణంపల్లి ఎస్సై చిరంజీవి వారి సిబ్బంది ఆధ్వర్యంలో తవణంపల్లె పరిధిలోని షికారి కాలనీ నందు కార్డెన్ సెర్చ్ నిర్వహించగా, రికార్డ్స్ సక్రమంగా లేని ఐదు టూ వీలర్ వాహనాలను అనధికారికంగా ఉంచుకోవడంతో వాటిని తవణంపల్లి ఎస్సై చిరంజీవి సీజ్ చేసి వాహనాలు నడిపే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈమధ్య టూవీలర్ దొంగతనాలపై కేసులు ఎక్కువగా వస్తుండడంతో కార్డెన్ సెర్చ్ చేయడం జరిగిందని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ మునివేలు, హెడ్ కానిస్టేబుల్ అమీర్ భాష, కానిస్టేబుల్ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.