రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది

తెలంగాణ రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనబడటం లేదు

మన,న్యూస్,ఎల్,బి,నగర్:రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందులతోటి గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని
వనస్తలిపురం లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు రాష్ట్రానికి,కేంద్రానికి ఆదాయ వనరులు సమకూర్చే వ్యవస్థ,సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపరం అని అలాంటి వ్యాపారము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతోమంది పెట్టుబడిదారులు బిల్డర్లు,ఏజెంట్లు,రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుటుంబాలు గడవక తెచ్చిన అప్పులు కట్టలేక ఈరోజు ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతున్నారు‌ ఒకవైపు ఎన్నికలు మరో వైపు హైడ్రా ఎఫెక్ట్తో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది.గత ప్రభుత్వం ప్రభుత్వంలో అన్ని వ్యాపారాలు సక్రమంగా జరిగాయని కొనుగోలుదారులకు అమ్మకు దారులకు ధైర్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుండేదని బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.కానీ సంవత్సరన్నర కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారము తెలంగాణ రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనబడటం లేదని బొంగు వెంకటేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొనుగోలుదారులు ప్లాట్లు గాని,భూములు గాని,ఇండ్లు గాని మార్కెట్ ధర ప్రకారము నిర్ణయించుకొని రిజిస్ట్రేషన్ చార్జీలు డాక్యుమెంట్ చార్జీలు అన్ని కలుపుకొని అధిక రేట్లు రాష్ట్రంలో ప్లాట్లు భూములు ఇండ్లు ఆకాశాన్నిఅంటాయి.ఈరోజు రాష్ట్రంలో ఓటర్ రింగ్ రోడ్డు,రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధి పేరిట భూములకు,ఫ్లాట్లకు రెక్కలు వచ్చాయి వ్యవసాయ భూములు కూడా ఈరోజు రాష్ట్రంలో కొనుగోలుదారులు అమ్మకు దారులు కూడా వ్యాపార నేపథ్యంలోనే చూస్తా ఉన్నారు.కావున రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము అందనంత దూరంలో ఉన్నది.ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి మేధావులు,ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రైవేటు వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా అన్ని రంగాలలో స్థిర పడ్డటువంటి వారు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చి చొరబడ్డారు.కావున రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలు గానీ బాధలు కష్టాలు కన్నీళ్లు తూర్చేటువంటి ప్రభుత్వాలు గాని సంఘాలు గాని వారి వారి బాధలు తీర్చే వ్యవస్థ ఒకటి లేదు.రాష్ట్రంలో ఒక ప్లాటు,భూములు అమ్మిన కొన్న మధ్యవర్తిగా ఉండేటువంటి వ్యక్తి ఏజెంట్.ఈరోజు ఏజేట్లు ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబాలు గడపక అప్పుల పాలవుతున్నారు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారంలో రాణించాలని ప్లాట్లు కొనే దగ్గర అమ్మే దగ్గర డాక్యుమెంట్ పరంగా సరిగా చూసుకొని కొనుగోలుదారులకు అమ్మకు దారులకు బాధ్యతగా వారికి రిజిస్ట్రేషన్ చేయించేటువంటి వ్యక్తులకు వ్యాపారాలు లేవు.ఆ ఏజెంట్లు ఈరోజు రాష్ట్రంలో ఇల్లు గడపక పనులు లేక ఇంకో పని చేయలేక ఈ వ్యాపారంలో స్థిరపడినప్పటికీ రెండు నెలలకో ఆరు నెలలకో ఏదో ఒక ప్లాట్ అమ్మితే కుటుంబం గడుస్తుందని నమ్మకం తోటి ఈ వ్యాపారంలో నుండి బయటకు వెళ్లలేక పోతున్నారు అలాంటి వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది.అదేవిధంగా రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయామని తెచ్చిన వడ్డీలు కట్టలేక అప్పులు ఇచ్చిన వారి నుండి తప్పించుకోలేక ప్లాట్లు భూములు ఇండ్లు కొని అగ్రిమెంట్ చేసుకున్న వారు అధిక వడ్డీల బారి నుండి రిలాక్స్ కావాలని ఆ ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పులు ఇచ్చిన వారి నుండి వేధింపులు భరించలేక ఉరికొయ్యను ముద్దాడుతా ఉన్నారు‌
దీనికి అంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇబ్రహీంపట్నంలోని మంగళపల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.అదేవిధంగా అమీర్పేట్ లో అధిక వడ్డీ దారుల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది.ఇక చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోజుకు ఏదోచోట ఆత్మహత్యలకు కిడ్నాప్పులు మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి.వీటిని ఆపడం ఎవరి తరం అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండా!ఇటు ప్రభుత్వాలనుండా ఆ కుటుంబానికి భద్రత భరోసా ఎవరిస్తారు.కావున రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలలో నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుటుంబాలు గానీ వారి ఆర్థిక స్థితిగతులు గాని పట్టించుకోకపోవడం బాధాకరం.
వారు రాష్ట్రంలో ఓటర్లు కాదా!ఈ రాష్ట్ర ప్రజలు కాదా! వారి కష్టం నుండి వచ్చే ఆదాయం మీ ప్రభుత్వ వనరులు కాదా! అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దయాదాక్షణలమీద ప్రభుత్వాలు నడుస్తున్న విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి‌ హైడ్రా మూలంగా ప్లాట్లు భూములు కొనేవారు అమ్మేవారు ప్రతిదీ ఈ రోజు ఆర్ వన్ జోన్ చెరువులు కుంటలు ఉన్నాయా ఆ ప్లాట్ కబ్జాలో ఉందా డబుల్ రిజిస్ట్రేషన్ ఇలా పలు రకాలుగా కొనుగోలుదారులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు చాలామంది ఈ వ్యవస్థను నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు కావున రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇబ్బందుల దృష్టి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…