

మనన్యూస్,పినపాక:కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో జరుగుతున్న శ్రీసమ్మక్క,సారలమ్మ జాతర పరిసర ప్రాంతాన్ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.జాతర వివరాలను ఆలయ కమిటీ ని అడిగి తెలుసుకున్నారు.సిరిమల్ల జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు.మంగళవారం కుంకుమ పూజ,మండవెలుగుడు కార్యక్రమంలో జాతర ప్రారంభం కానుంది.ఈనెల 15 వరకు జాతర జరగనుంది.ఈనేపద్యంలో డిఎస్పీ రవీందర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు.ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని,భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై రాజేందర్,ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు