

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం పోరాటం ఊపిరిగా.చేయూతే శ్వాసగ కష్టకాలంలో ఉన్నవారికి ఆపద్భాందవుడు పలుమార్లు స్థానిక ఎన్నికల్లో ఓటమి.కొనఊపిరి వరకు ప్రజలకే తన జీవితం అంకితం అంటున్న కర్నె రవి ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు.ఓటమి వెంటాడిన మనోధైర్యం కోల్పోలేదు.నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ,ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నారు మణుగూరుకు చెందిన అడ్వకేట్ సామాజిక కార్యకర్త కర్నె రవి.పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించి,పలువురు నిరుపేదలకు అండగా నిలిచారు.మణుగూరు మండలం లో ఏ ప్రజాప్రతినిధి చేయలేని పనిని మణుగూరు మండలం లోని ప్రయివేటు పాఠశాలల్లో ఏ అధికారం లేకుండానే 86 మంది తల్లిదండ్రులు చనిపోయిన,పిల్లలకు,ఎయిడ్స్ వ్యాది తో బాధపడుతున్న వారి పిల్లలకు,క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి పిల్లలకు తండ్రి చనిపోయిన నిరుపేద పిల్లలకు స్కూల్ బ్యాగ్,షూస్,ఇచ్చి ఉచితంగా విద్యా అందించే విధంగా కృషి చేశాడు గొదావరి వరదలు వల్లా ఇళ్లు కూలిపోయాయిన బాధితులకు,కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లా ఇల్లు కాలిపోయిన బాధితులకు సహాయం అందించడంలో ముందు ఉండి వారిలో మనోధైర్యం నింపాడు అంతే కాకుండా కరోనాలాంటి కష్టకాలంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా,కరోనా బాదితులకు తన వంతుగా సహాయం అందించి వారిలో మనోధైర్యాన్ని నింపి మానవత్వం చాటుకున్నారు. మణుగూరు మున్సిపాలిటీని గ్రామపంచాయతీ చేసి అన్నారం, రాజుపేట,శివలింగా పురం ఇలా తదితర గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం కల్పించాలని హైకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తున్నారు.మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలపై ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పలుమార్లు పాదయాత్ర చేసి,అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు.గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ గా వరంగల్ఖ మ్మం నల్లగొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసారు.అయినప్పటికీ ఏ మాత్రం రాజీపడకుండా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ పోరాటమే తన ఊపిరిగా సాగుతున్నారు కర్నె రవి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి మరోసారి తన అదృష్టం పరీక్షించుకొనున్నారు. నోటుకు ఓటు తీసుకోకుండా,ప్రజల కోసం పోరాటం చేసే తనను మణుగూరు జడ్పీటీసీ గా గెలిపించాలని రవి విజ్ఞప్తి చేశారు.తాను జడ్పీటీసీ గా గెలిస్తే మణుగూరు మున్సిపాలిటీని పూర్తి గ్రామ పంచాయతీగా మార్చేందుకు కృషి చేసి,వేలమంది ప్రజలకు ఉపాధి హామీ పథకం కల్పించేందుకు కృషి చేస్తానని రవి తెలిపారు.ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని,తన కొనఊపిరి ఉన్నంతవరకు ప్రజల కోసమే తన జీవితం అంకితం చేస్తానని కర్నె రవి అన్నారు.
