

మనన్యూస్,తిరుపతి:అహింసా ధ్యాన మహోత్సవంలో భాగంగా తిరుపతి స్పిర్చువల్ సొసైటీ మెగా శాఖాహార ర్యాలీ నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించింది.ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు.పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.మెగా శాఖాహార ర్యాలీ ద్వారా స్పిర్చువల్ సొసైటీ ప్రజల్లో శాఖాహారం పట్ల అవగాహాన తీసుకురావడం అభినందనీయమని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు యోగా,ధ్యానం తమ దిన చర్యలో భాగం చేసుకోవాలని ఆయన కోరారు.ఆధునిక జీవనశైలితో పెరుగుతున్న ఒత్తిడిని జయించడానకి యోగా చక్కని పరిష్కారమార్గమని ఆయన తెలిపారు.నరేంద్ర మోది ప్రధానమంత్రి అయ్యాక యోగాను ప్రపంచవ్యాప్తం చేశారని ఆయన కొనియాడారు.తిరుపతి స్పిర్చువల్ సొసైటీ ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్,మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయలు,టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణా,కార్పోరేటర్లు నరసింహాచ్చారి,ఎస్ కే బాబు,పొన్నాల చంద్ర,బిజేపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,సింగంశెట్టి సుబ్బరాయులు,వరప్రసాద్,కూరపాటి సురేష్ కుమార్,కోదండ,ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.