

మనన్యూస్,కామారెడ్డి:తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటర్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,మెదక్ జిల్లా అధ్యక్షులు,నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్స్ హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటర్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కో ఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించడం జరిగిందని అతని మరణం మనకు తీరని లోటని అతని యొక్క ఆత్మ శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగిందని తెలిపారు.మా యూనియన్ తరఫున వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఎక్కడ ఉన్న అతని యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.