

నిజాంసాగర్ జలాశయం ప్రధాన కారణపడి ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విఠల్ మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని సమీపంలో ప్రధాన కాలువలో చేప కనపడడంతో పట్టుకోడానికి వెళ్లి ప్రమాదశాత్తు కాలువలో గల్లంతయాడు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని నీటి విడుదలను నిలిపివేసి అనంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారు.